కంచరపాలెంలో గంజాయి ముఠా..! విశాఖపట్నంలో గంజాయి తరలిస్తున్న ఓ బిహార్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రైలులో దిల్లీకి తరలించేందుకు సిద్దం చేశారని విచారణలో తేలింది. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కంచరపాలెం వద్ద అనుమానంతో తనిఖీలు చేయగా... వారి బ్యాగుల్లో 50 కేజీల మత్తు పదార్థం గుర్తించామని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఈ ముఠా రవాణా చేస్తున్నట్లు తేలింది.
ఇవీ చదవండి...గంజాయి గుంజుతున్న హైదరాబాద్...!