ఈహెచ్‌ఎస్, ఆరోగ్య శ్రీ బకాయిలు ఉన్నమాట వాస్తవమేనని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టంచేశారు. బకాయిల చెల్లింపునకు వంద కోట్ల రూపాయల నిధుల కోసం జీవో విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. రెండు, మూడు నెలల్లో బకాయిలను చెల్లిస్తామని స్పష్టం చేశారు. విశాఖ వైద్య విజ్ఞాన(విమ్స్) సంస్థలో సిబ్బంది నియామక ప్రక్రియ మార్చి, ఏప్రిల్‌లోగా పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రులను దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. వైద్య,ఆరోగ్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
'దశల వారీగా ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం'
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రులను దశల వారీగా అభివృద్ధి చేస్తామని వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు రెండు, మూడు నెలల్లో ఈహెచ్‌ఎస్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తామని మంత్రి తెలిపారు.