విశాఖ మన్యం పాడేరు మండలం గుర్రగరువులో మంచినీటి ట్యాంకు అపరిశుభ్రంగా తయారైంది. దాన్ని శుభ్రం చేయాలని గ్రామంలోని యువకులు భావించారు. అందుకోసం అధికారులకు అర్జీలు పెట్టలేదు... గ్రామస్థుల్ని సమీకరించారు. అందరూ కలిసి సమష్టిగా ట్యాంకును శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు పరిశుభ్రమైన నీరు తాగుతున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కూర్చోకుండా మనకు సాధ్యమైనంతలో సమస్యల్ని మనమే పరిష్కరించుకోవచ్చని చాటిన ఆ గ్రామస్థులు అభినందనీయులు.
ఇవీ చదవండి... విశాఖ ఘటనపై ఎన్జీటీకి కమిటీ నివేదిక.. పరిశీలించాకే తదుపరి ఆదేశాలు