విశాఖ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నీళ్లు లేక ముడసర్లోవ జలాశయం వెలవెలబోతుంది. గత కొద్ది నెలలుగా నగరంలో వర్షాలు పడక జలాశయంలో నీరు అడుగట్టింది. దీంతో సమీప ప్రాంతాలు తీవ్ర నీటికొరతను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు జలసిరితో కళకళలాడిన జలాశయం ప్రస్తుతం దీనస్థితిని ఎదుర్కోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు స్థానికులు. ఎంతో ఆకర్షణీయమైన, పర్యావరణ హితమైన జలాశయానికి వర్షపునీరు రాకపోవటానికి పలు కారణాలు ఆటంకంగా మారుతున్నాయి.
ఇదీ చదవండి : పల్లె మొత్తం ప్రకృతి బాట...