ETV Bharat / state

సమృద్ధిగా నీటి నిల్వలు.. సీజన్ కంటే ముందుగానే సాగుకు ఏర్పాట్లు - తాండవ జలాశయం, ఏలేరు కాలువ అనుసంధానం తాజా వార్తలు

విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం కింద ఈ ఏడాది ఖరీఫ్ సాగు రెండు నెలల ముందుగానే ప్రారంభమయ్యేలా అధికారులు కార్యాచరణ మొదలు పెట్టారు. జలాశయంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండటం ఇందుకు కారణంగా పేర్కొన్నారు. ఏలేరు కాలువకు తాండవ జలాశయాన్ని అనుసంధానం చేస్తే మరిన్ని భూములు సాగులోకి వస్తుండటంతో.. ఆ దిశగా ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది.

water flow in thandava jalasayam
తాండవ జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వలు
author img

By

Published : Jan 4, 2021, 12:40 PM IST

విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన శాసనసభ్యులు ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేసి జలాశయం పరిస్థితిని వివరించారు. ప్రధానంగా ఈ రెండు జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు చెందిన భూములు సాగుకు సరిపడ నీరు లేదని సీఎంకు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. తాండవ జలాశయం నీటిమట్టం పుష్కలంగా ఉన్నప్పటికీ మెట్ట ప్రాంతాల వరకు నీరు చేరకపోవటంతో.. ఏలేరు కాలువ నుంచి విశాఖ ఉక్కు కర్మాగారానికి నీటిని అందిస్తున్నారు. ఏలేరు కాలువను ఈ జలాశయానికి అనుసంధానం చేస్తే మరిన్ని మెట్ట ప్రాంత భూములు సాగులోకి వస్తాయని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీంతో ఈ ఏడాది తాండవ జలాశయాన్ని ఏలేరు కాలువకు అనుసంధానం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదించింది.

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందుగానే ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 77 గ్రామాల్లో సుమారు 52 వేల ఎకరాలు ఈ జలాశయం కింద సాగులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ మొత్తం ఆయకట్టుకు ఏకధాటిగా విడుదల చేస్తే వంద రోజులకు సరిపోతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో సెప్టెంబర్ నాటికి పంట దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. తద్వారా భారీ వర్షాలు, తుపాను వంటి విపత్తుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని జలవనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఈ మేరకు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి జూన్ నెల కల్లా విత్తనాలు, నారు సిద్ధమయ్యేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లో సుమారు 14 గ్రామాల్లో 2600 ఎకరాల ఆయకట్టు కలిగిన రావణ పెళ్లి జలాశయం ప్రస్తుతం పూర్తి స్థాయి నీటిమట్టంతో కొనసాగటం.. రెండో పంటగా వరి వేయడానికి రైతులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే వరికోతలు పూర్తి కావటం.. మళ్లీ నారుమళ్లు సిద్ధం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇవీ చూడండి...

ఇళ్ల పట్టాల పంపిణీలో ఏర్పాటు చేసిన శిలాఫలకం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.