ఇటీవల ఎడతెరిపి లేకుండా కురస్తున్న వర్షాలతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరుగుతోంది. ఎంతలా పెరుగుతుందంటే, బోరింగ్ కొట్టకపోయినా బోరులో నుంచి నీళ్లు ఉబికి పైకి వచ్చేస్తున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో రాయగడ జిల్లా తడమా పంచాయతీ బంజిలి గ్రామంలో బోర్లు కొట్టకుండానే నీరు బయటకు రావడంతో ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. భూగర్భ జలాలు ఎక్కువైనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ఇరవై రోజుల తర్వాత మామూలు స్థితికి బోరింగ్ వచ్చేస్తుందని వారు చెబుతున్నారు.
ఇదీ చదవండి : బిగ్బాస్-3 కార్యక్రమంపై హెకోర్టులో వ్యాజ్యం