విశాఖలో గత 15ఏళ్లుగా జర్నలిస్టులకు ఆటల పోటీలు నిర్వహిస్తోంది వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం. ఈ ఏడాది ఈ నెల 25 నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయని వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. నిత్యం పని ఒత్తిడిలో ఉన్న జర్నలిస్టులకు... మానసికంగా ప్రశాంతతను, దేహ దారుఢ్యం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఆటలకు సంబంధించిన గోడ పత్రికను ప్రెస్ క్లబ్లో వీజేఎఫ్ పాలకవర్గం ఆవిష్కరించింది. ఈ టోర్నీలో పాల్గొనేవారు ముందుగా తమ పేర్లను ప్రెస్క్లబ్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇవీ చదవండి