కళాంజలి, విశాఖ విమెన్ డిజైనర్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా 'వైజాగ్ స్టైల్ వీక్ ఫ్యాషన్ షో' నిర్వహిస్తున్నారు. నగరంలోని నొవాటెల్ హోటల్ ఈ కార్యక్రమానికి వేదికైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ షోను.. కళాంజలి, విమెన్ డిజైనర్ సంస్థల ప్రతినిధులు జ్యోతి ప్రజ్యలన చేసి ప్రారంభించారు. స్థానిక బొటిక్‌ల ప్రత్యేక డిజైనర్ వస్త్రాలను ప్రదర్శిస్తున్నారు. చివరి రోజున ప్రముఖ మోడల్స్‌తో ఫ్యాషన్ షో నిర్వహించి ..విజేతలను ప్రకటిస్తారు. మహిళలను ఆకర్షించే విభిన్న రకాల చీరలు, అలంకరణాలు స్టాల్స్‌లో కొలువుదీరాయి.
ఇవీ చదవండి...తిరుపతిలో టాక్సీవాలా భామ సందడి