ETV Bharat / state

'జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించాలి'

జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించాలని విశాఖ జేసీ - 1 అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన.. భవిష్యత్తులో తాగునీటికి కొరత రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

vizag joint collector meeting with several officials
జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించాలి
author img

By

Published : Jun 27, 2020, 10:56 PM IST

విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ - 1 ఎం వేణుగోపాలరెడ్డి... వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి జిల్లాలోని చెరువులు, కుంటలను పరిరక్షించేందుకు 15 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. నీటి వనరులను పరిరక్షించటం, పునరుద్ధరించటం అంత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలన్నారు.

చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచటం, కాలుష్యం బారిన పడకుండా కాపాడటం... ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జీవీఎంసీ పరిధిలో వాననీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జేసీ సూచించారు. భవిష్యత్తులో తాగునీటి కొరత నివారించేందుకు జల వనరులు కాపాడుకోవాలన్నారు.

గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలందర్నీ భాగస్వామ్యం చేస్తూ జల వనరుల పరిరక్షణ చేపట్టాలని జేసీ సూచించారు. కొత్త చెరువులు, కుంటలు నిర్మించటంతో పాటు పాతవాటిలో పూడిక తీయాలన్నారు.

ఇదీ చదవండి:

'అర్హులైన గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.