రూ.450 కోట్ల మొత్తానికి నకిలీ ఇన్ వాయిస్? - నకిలీ ఇన్ వాయిస్‌లపై స్పందించిన విశాఖ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్
జీఎస్టీకి సంబంధించి ఓ సంస్థ పాల్పడిన మోసాన్ని విశాఖ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ వెలికి తీసింది. 450 కోట్ల రూపాయల విలువైన నకిలీ ఇన్ వాయిస్‌లను ఆ సంస్థ సృష్టించినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ధరించారు.
![రూ.450 కోట్ల మొత్తానికి నకిలీ ఇన్ వాయిస్?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4775845-819-4775845-1571275259376.jpg?imwidth=3840)
అంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడులలో ఓ సంస్థకు చెందిన యూనిట్లలో ఏక కాలంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేశారు. 2018 సెప్టెంబర్ - 2019 ఆగస్టు మధ్యన 450 కోట్ల రూపాయల విలువైన నకిలీ ఇన్ వాయిస్ లను సంస్థ సృష్టించినట్లు నిర్ధరించారు. 67 కోట్ల రూపాయిల అనర్హమైన ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందినట్టు విచారణలో తేల్చారు. కంపెనీ, ఎండీ పేర్లను వెల్లడించనప్పటికీ... తమిళనాడులోని కోయంబత్తూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇన్ ఫ్రా కంపెనీగా తెలుస్తోంది. ఆ కంపెనీ ఎండీని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయనకు ఈనెల 30 వరకు జుడీషియల్ కస్టడీ విధించినట్టు జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్త సంచాలకుడు మయాంక్ శర్మ వెల్లడించారు. పూర్తి వివరాలు తేలే దిశగా ఈ కేసు విచారణ కొనసాగిస్తామన్నారు.
ఇదీ చదవండి