రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ను, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను జీవీఎంసీ మేయర్ వెంకట హరికుమారి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన నగర మేయర్ హరికుమారికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. మహా విశాఖ నగరపాలక సంస్థను దేశంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఎంపీ స్పష్టం చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పౌర సేవలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. మేయర్ దంపతులతో పాటు డిప్యూటీ మేయర్ జి శ్రీధర్ ఎంపీని కలిశారు.
ఇదీచదవండి.