విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా సమన్వయంతో ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ వి. వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్షలో ఎన్నికల సమయంలో అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, నిబంధనలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఏ మాత్రం ఏమరుపాటు తగదని స్పష్టం చేశారు. గుర్తుల కేటాయింపు, ఓట్ల లెక్కింపు, గెలుపు ధ్రువీకరణ వరకూ పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: నర్సీపట్నంలో వైకాపా విస్తృతస్థాయి సమావేశం