చిన్నారులకు పౌష్టికాహారం అందించి కరోనా మహమ్మారి బారిన పడకుండా సంరక్షించుకుందాామని విశాఖలోని వివేకానంద సంస్థ పిలుపునిచ్చింది. నగరంలోని వన్‌టౌన్‌లోని వివేకానంద ట్యూషన్ సెంటర్లో చదువుతున్న 30 మంది చిన్నారులకు కోడిగుడ్లు, మాస్కులు, బీ కాంప్లెక్స్ మాత్రలు అందజేశారు.
పిల్లలకు కరోనాపై అవగాహన కల్పించారు. కొవిడ్ నేపథ్యంలో చిన్నారుల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు విజ్ఞప్తి చేశారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే కాకుండా వారితో తేలికపాటి వ్యాయామాలు చేయించాలని సూచించారు.
ఇదీ చదవండి..