కరోనా వ్యాప్తిని అత్యాధునిక రేడియేషన్ టెక్నీక్ ద్వారా తగ్గించవచ్చని ఒమేగా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అతి అరుదైన ఈ పద్దతి ద్వారా రోగి తరచుగా ఆసుపత్రికి వచ్చే అవసరం తగ్గడమే కాకుండా... ఆసుపత్రిలో గడిపే సమయం కూడా తగ్గుతుందని ఒమేగా హాస్పిటల్స్ ఎండీ డా.రవి శంకర్ వెల్లడించారు. సర్ఫేస్ గైడెడ్ రేడియో థెరపీ ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 750 ఆసుపత్రుల్లో మాత్రమే ఈ అత్యాధునిక రేడియేషన్ పద్దతి అందుబాటులో ఉందని చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద విశాఖలోని ఒమేగా హాస్పిటల్లో మాత్రమే ఉందని వివరించారు.
ఇదీ చూడండి కరోనా తర్వాత రవాణా రంగంలో కోటి ఉద్యోగాలు!