జిల్లాలో ఖరీఫ్ సీజన్లో లక్షా 82 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుచేస్తున్నారు. ఇందుకు కనీసం 30 వేల టన్నుల యూరియా అవసరమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే పూర్తి స్థాయిలో ఎరువులు రాని కారణంగా.. రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా అందించాల్సి ఉన్నా... సిబ్బంది కొరత కారణంగా చాలా ప్రాంతాల్లో ఈ ప్రక్రియ అమలు కావటం లేదు. ఫలితంగా అన్నదాతలు... ప్రైవేటు డీలర్ల వద్ద అధిక వ్యయంతో ఎరువులు కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: