విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాన్ని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు పరిశీలించారు. పట్టణంలో కేసుల సంఖ్య పెరుగుతున్నందున పోలీసులను, అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. రెడ్‌జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో సురక్షిత వాతావరణం కల్పించే విధంగా పురపాలక, ఆరోగ్య సిబ్బంది మధ్య సమన్వయం ఉండేలా చేయాలని సూచించారు. పట్టణంలో కర్ఫ్యూను మున్సిపల్ కమిషనర్ లేదా తహసీల్దార్లు పర్యవేక్షిస్తారని తెలిపారు.
ఇదీ చదవండి.