గణపతి నవరాత్రుల నిర్వహణ ఏర్పాట్లపై విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఆధ్వర్యంలో నగర పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గణేశ్ మండపాలకు అనుమతులు, ఊరేగింపులు వంటి అంశాలపై వారు చర్చించారు. మండపాలు ఏర్పాటు చేసుకునే వారి కోసం గణేశ్ ఉత్సవ్ 2019.కామ్ అనే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని...ఇందులో వివరాలు నమోదు చేసి అనుమతులు పొందవచ్చని ఆయన వివరించారు. పరిమిత ఎత్తులో ఉండే విగ్రహాల్ని మాత్రమే సముద్రంలో నిమజ్జనానికి అనుమతిస్తామని...భారీ గణనాథులను మండపాల వద్దనే నిమజ్జనం చేసుకోవాలని సమావేశంలో సీపీ స్పష్టం చేశారు. గణేశ్ నవరాత్రి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. నిమజ్జనాల కోసం మొత్తం 18 ప్రదేశాలను ఎంపిక చేసినట్లు సీపీ ఆర్కే మీనా వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఇది ఆరంభమే... ఇకపై అంతకుమించి'