పేదలకు అందించాల్సిన పింఛన్ సొమ్ములు.. గ్రామ వాలంటీర్ భర్త దుర్వినియోగం చేయడంతో.. గ్రామస్థులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ ఊడపాలెంలో.. గ్రామ వాలంటీర్ రాజేశ్వరి, పేదలకు పంపిణీ చేయవలసిన పింఛను సొమ్ము సెక్రటరీ నుంచి తీసుకువచ్చి ఇంట్లో పెట్టింది. ఆమె భర్త రాజందొర ఇంట్లో సొమ్ము తస్కరించి జూదం ఆడాడు. ఈ నెల 1న చెల్లించాల్సిన పింఛను అందకపోవడంతో లబ్ధిదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జి.మాడుగుల ఎంపీడీఓ వెంకన్నబాబు విచారణ చేయించారు. లబ్ధిదారులకు పింఛను చెల్లించకపోవడంతో పాటు.. ఆరుగురికి డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్లు రాసుకోవడం వంటి వివరాలను సేకరించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల దాడులు.. భారీగా అక్రమ మద్యం, నాటుసారా పట్టివేత