ఎన్నికల వేళ మద్యం, డబ్బు, ఇతరత్రా ప్రలోభాలతో ఓటర్లకు వల విసరడం అంతటా చూస్తున్నాం. కాని విశాఖ మన్యంలోని కొన్ని గిరి పల్లెలు ఇందుకు విరుద్ధం. వారు నిర్దేశించుకున్న కట్టుబాట్లను నిక్కచ్చిగా పాటిస్తూ స్ఫూర్తిని చాటుతున్నారు. చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీలో మద్యం, సిగరెట్టు, గుట్కా, ఖైనీ తదితర మత్తు పదార్థాల విక్రయాన్ని పూర్తిగా నిషేధించారు. స్థానికులే ఏటా చందాలు వేసుకొని గ్రామంలో ఆలయాలు, సంఘ భవనాలు నిర్మించుకున్నారు. ఇక్కడ ఉద్యాన, కాఫీ పంటల సాగు అధికం. ఆ ఆదాయంలో కొంత మొత్తాన్ని ఊరి బాగుకు వెచ్చిస్తున్నారు. చిక్కుడుబట్టి, బద్దిమెట్ట, వేనం, రోలుగుంట, గాదిగొయ్యి, సమగిరి, ఎర్రవరం, తోటమామిడి గ్రామాల్లోనూ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది.
ఇదీ చదవండి: తెరపైకి పుర పోరు... ఆగిన చోటు నుంచే చేపట్టే యోచన