Two Tahsildars Attacked On Real Estate Agent While Drunk in Chittoor : మద్యం మత్తులో ఇద్దరు తహసీల్దార్లు వీరంగం సృష్టించిన ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపింది. పట్టణంలోని ఓ భోజనశాలపైన ఉన్న బార్‌లో సోమవారం రాత్రి గంగవరం, పెద్దపంజాణి తహసీల్దార్లు హాల్చల్ చేశారు. స్థిరాస్తి వ్యాపారంలో తలెత్తిన వివాదం కారణంగా కృష్ణకుమార్ అనే వ్యక్తిపై ఇద్దరు తహసీల్దార్లు దాడి చేసి గాయపరిచారు. చిత్తూరు పట్టణానికి చెందిన కృష్ణకుమార్ కొద్దికాలం క్రితం పలమనేరులో స్థిరాస్తివ్యాపారం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఆర్థిక లావాదేవీలు, భూ పంపకాల్లో కృష్ణకుమార్, తహసీల్దార్ల మధ్య వివాదం తలెత్తింది.
ఫుల్లుగా తాగి వీరంగం : అయితే సోమవారం పెద్దపంజాణి తహసీల్దారు ప్రసన్న, గంగవరం తహసీల్దారు శివ బార్‌లో పూటుగా తాగి మద్యం మత్తులో ఉన్నారు. అదే బార్‌లో స్థిరాస్తివ్యాపారి కృష్ణకుమార్ మరో టేబుల్‌లో కూర్చున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు తహసీల్దార్లు అతడిని తిడుతూ దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో కృష్ణకుమార్ అక్కడి నుంచి కిందకు వచ్చి మీడియా, స్థానికులతో మాట్లాడారు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న తనకు చెందాల్సిన భూమిని అడిగినందుకే తనపై విచక్షణారహితంగా ఇద్దరు తహసీల్దార్లు దాడి చేశారని ఆరోపించారు. చరవాణిలో అసభ్యకరంగా మాట్లాడారని తెలిపారు.
కేసు నమోదు చేయలేదని - పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్ఐపై దాడి
సామాజిక మాధ్యమాల్లో వైరల్ : నేరుగా వస్తే నాలుక చీలేలా కొట్టి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తనపై దాడి చేసిన ఇద్దరు తహసీల్దార్లపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అతడు మాట్లాడిన మాటలు, తహసీల్దార్లతో ఫోన్ సంభాషణలు సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థిరాస్తి వ్యాపారి కృష్ణకుమార్పై మద్యం మత్తులో దాడి చేసిన తహశీల్దార్లు శివ, ప్రసన్నను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణకుమార్ పై దాడి ఘటన ప్రసార మాధ్యమాల్లో రావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
'సెల్యూట్ టు ఏపీ పోలీస్ - 'చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లిన సీఐ'
'అల్లు ఆర్మీ, అభిమానుల పేరుతో వందల కాల్స్ - చంపేస్తామని బెదిరింపులు'