మహాశివరాత్రి పర్వదినాన రాత్రంతా జాగారాలు చేసిన భక్తులు... విశాఖ సాగరతీరంలో పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే సముద్రస్నానాలు ఆచరించేందుకు నగరవాసులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారు. శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంగా మేల్కొని... ఉదయాన్నే సముద్రస్నానం చేస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని జిల్లావాసులంతా పాటిస్తున్నారు. సముద్రస్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. గజఈతగాళ్లను పెట్టి పర్యవేక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...