విశాఖలో బాణసంచా విక్రయాల అనుమతులపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో బాణసంచాపై నిషేధం విధించిన కారణంగా అనుమతుల జారీపై సందేహాలు నెలకొన్నాయి. కలెక్టర్, పోలీసు కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ స్థాయి అధికారులు వీటి విక్రయాలకు అనుమతులు జారీ చేయనున్నారు. ఇప్పటి వరకు దీపావళి సామగ్రి విక్రయాలకు సంబంధించి సుమారు 100 వరకు దరఖాస్తులొచ్చాయి. అయితే దీపావళికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉన్నా... ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు జారీ చేయలేదు. దీంతో వ్యాపారుల్లో సందిగ్ధంలో పడ్డారు. రెండు రోజుల్లో యంత్రాంగం దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: