ETV Bharat / state

లాక్​డౌన్ ఎఫెక్ట్: పుస్తకాలు పట్టాల్సిన చిట్టి చేతులు.. పని చేస్తున్నాయి!

author img

By

Published : Jun 30, 2020, 8:38 PM IST

Updated : Jul 1, 2020, 11:49 AM IST

పాఠశాలకు వెళ్దామంటే కరోనా కారణంగా సెలవులు ఇచ్చారు. పరిజ్ఞానం పెంచుకుందామంటే ఆన్​లైన్ క్లాసులు ఉండవు. ఏమీ చేయలేని స్థితిలో ఉండి... ఇంటి పనులు, పొలం పనులకు పరిమితమై దుర్భర జీవితాన్ని సాగిస్తున్న విశాఖ జిల్లా మన్యం విద్యార్థుల కష్టాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

vishaka manyam students are working in farms are schools are closed
పొలం బాట పట్టిన మన్యం విద్యార్థులు

కరోనా విజృంభణతో పాఠశాలలు లేని కారణంగా... విశాఖ ఏజెన్సీలో విద్యార్థులు ఇళ్ల పనులు, పొలం పనుల్లో మునిగిపోతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొందరు ఇంటి నిర్మాణం కోసం రాళ్లు ఎత్తుతుంటే మరికొందరు పశువులు కాస్తున్నారు. కొందరైతే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు. వీరందరిని ఈటీవీ భారత్ పలకరించగా.. పాఠశాలలకు వెళ్లకపోవడం వల్ల చదువుకు దూరమవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.

నగరాల్లో అయితే తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆన్లైన్ క్లాసులు అంటూ మొబైల్ ఫోన్లలో చదివిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో, కొండ గ్రామాల్లో.. మొబైల్ సిగ్నల్స్​ సరిగ్గా ఉండవు. స్మార్ట్ ఫోన్ వాడకం కూడా అంతంత మాత్రమే. ప్రభుత్వ పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టినా చూసే భాగ్యం మన్యం విద్యార్థులకు లేదు. టీచర్, నర్సింగ్​ చదువుకున్న వాళ్లు సైతం... పశువులు కాయడం, ఉపాధి పనులు చేస్తున్నారు.

పొలం బాట పట్టిన మన్యం విద్యార్థులు

మన్యంలోని చాలా ప్రాంతాల్లో.. బాలబాలికలు వ్యవసాయ పనుల్లో మగ్గిపోవడం.. తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. పశువులను తీసుకుని కొండ ప్రాంతాల్లో రోజంతా ఉండి తిరిగి సాయంత్రం ఇళ్లకు సాయంత్రం చేరుకుంటున్నారు. వారి వద్ద చదువుకునేందుకు పుస్తకాలు కూడా లేకపోవడంతో.. చదువుకు దూరమవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసి కళాశాలకు వెళ్లవలసిన వారు కూడా పై చదువులకు వెళ్లలేక... చదువులు మోయాల్సిన వయసులో బరువులు మోస్తున్నారు. మన్యంలో ఆశ్రమ పాఠశాలలు, వివిధ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 50 వేలకు మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు పౌష్టికాహారం లభిస్తున్న కారణంగా.. ఆరోగ్యంగా ఉంటారు. ఇళ్ల వద్ద కష్టపడి పనిచేస్తూ... సరైన తిండి లేకపోవడంతో పౌష్టికాహార లోపంతో మిగిలిన విద్యార్థులు.. ముప్పునకు దగ్గరగా ఉన్నారు.

మన్యం విద్యార్థులకు కరోనా కాలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి... విద్య, పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు చదువు దూరం కాకుండా చూడాలని చిన్నారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

పెళ్లై కొద్ది నెలలే.. అంతలోనే విషవాయువు మింగేసింది

Last Updated : Jul 1, 2020, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.