ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ సమీప గ్రామాల్లో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎంత శుభ్రం చేసినా.. ఇళ్లలో రసాయన వాయువు ఉంటోంది. లాక్డౌన్ అని తెలిసి... కొనుకున్న వంట సామగ్రి అంతా రసాయనమయం కావడం వల్ల బయటే పడేశారు. ప్రస్తుతానికి ఎల్జీ పరిశ్రమ వీరికి ఆహారం అందిస్తోంది.
ఎలాంటి పనులు లేక గ్యాస్ లీకేజ్ బాధిత గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషవాయువుతో పాడిపశువులు మృతిచెందడంతో జీవనాధారం పోగొట్టుకున్నారు. ఇప్పటి వరకు వైద్య పరీక్షలు చేయలేదని.. కొంతమంది ఆందోళన చెందుతున్నారు. వెంటనే వైద్య సహాయం కావాలని కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం కూడా ఇంకా అందలేదని చెబుతున్నారు.
ఇదీ చదవండి: స్టైరిన్ మోనోమర్ ఎగుమతికి ఏర్పాట్లు సిద్ధం: కస్టమ్స్ అండ్ జీఎస్టీ చీఫ్ కమిషనర్