ETV Bharat / state

'ఉపాధ్యాయులను నియమించకపోతే... ఎన్నికలను బహిష్కరిస్తాం'

ఇంత అన్యాయం జరుగుతుంటే.. మేము ఎందుకు వచ్చి ఓటు వేస్తాం... మేము ఓటు వెయ్యము... మా ఇంట్లో ఉన్న వారిని సైతం ఓటు వేసేందుకు వెళ్లనివ్వం.. ఎన్నికలను బహిష్కరిస్తాం అంటున్నారు విశాఖ జిల్లా దారకొండ గ్రామస్థులు. వారి ఎందుకు ఇలా అంటున్నారు.. వారికి జరుగుతున్న అన్యాయం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..!

darakonda villagers agitation
దారకొండ గ్రామస్తుల ఆందోళన
author img

By

Published : Feb 3, 2021, 4:00 PM IST

దారకొండ గ్రామస్థుల ఆందోళన

ఇక్కడ ఉపాధ్యాయులను బదిలీలు.. డిప్యూటేషన్లపై పంపించేశారు.. ఉన్న ఒక్క ఉపాధ్యాయురాలికి ఆరోగ్యం సరిగ్గా లేక విద్యార్థులకు చదువు చెప్పటం లేదు అంటూ.. విశాఖ మన్యం గూడెం కొత్తవీధి మండలం దారకొండ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దారకొండ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో... 180 మంది విద్యార్థులకు కేవలం ఒక్క ఉపాధ్యాయురాలు మాత్రమే ఉంది. తమ పిల్లల భవిష్యత్తు గురించి అధికారులు ఆలోచించి.. ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. లేకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని.. గ్రామస్తులంతా ముక్త కంఠంతో హెచ్చరించారు.

దారకొండ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిది మంది ఉపాధ్యాయులు విధుల్లోకి చేరగా... నెల రోజుల వ్యవధిలోనే డిప్యూటేషన్​పై వారికి అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లిపోయారు. కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు తెరుచుకున్నాయి. పాఠాశాలలో మిగిలిన ముగ్గురు ఉపాధ్యాయుల్లో.. ఒకరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోగా.. మరొకరు విధులకు గైర్హాజరవుతున్నారు. ఇక మిగిలిన ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే పాఠశాలకు వస్తున్నారు. దీంతో విద్యార్థులందర్నీ ఒక్కచోటే కూర్చోబెట్టి.. పాఠాలను బోధిస్తున్నారు.

స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తాం

పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించకపోతే.. స్థానిక ఎన్నికల్లో ఓటు వెయ్యమని గ్రామస్థులు స్పష్టం చేశారు. తమ పిల్లల భవిష్యత్తుని బాగుచేయని అధికారులు, ప్రజాప్రతినిధులు మాకెందుకని.. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి: ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం వ్యతిరేకం కాదు: నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.