సచివాలయం ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని.. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులకు సూచించారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో మారుమూల గ్రామాలైన కంటారం, బాలారంలో కలెక్టర్ పర్యటించారు. కంటారం సచివాలయం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణాలను త్వరతిగతిన పూర్తి చేసి.. సచివాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కంటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. అక్కడ అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడి స్వయంగా తెలుసుకున్నారు.
అనంతరం బాలారంలోని బాకులూరు సచివాలయాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సచివాలయం ద్వారా ప్రజలు అన్ని సేవలను అందించాలని సూచించారు. ప్రజలు ఎప్పుడు వచ్చినా.. సచివాలయ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సచివాలయం ద్వారా 545 సేవలను అందిస్తున్నమనీ.. వీటిపై గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు.
సచివాలయం నిర్వహణపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా.. ఉపేక్షించేంది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఆర్ కొత్తూరు, అడ్డాకుల బలరం, కంఠరం గ్రామాలను గొలుగొండ మండలంలో విలీనం చేయాలని ఆయా గ్రామస్తులు కలెక్టర్ని కోరారు.
ఇదీ చదవండి:
'అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి'