COLLECTOR RESPONDED ON STUDENTS PROTEST: విశాఖ జిల్లాలో గిరిజన సంక్షేమ బాలికల ఆందోళనపై 'ఈటీవీ ఆంధ్రప్రదేశ్' ప్రసారం చేసిన కథనానికి కలెక్టర్ మల్లికార్జున్ స్పందించారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద విద్యార్థినుల ఆందోళన చేపట్టడంపై విచారణకు ఆదేశించారు. విద్యార్థినుల సమస్యలపై విచారణ జరపాలని ఐటీడీఏ పీవోను ఆదేశించారు. దీంతో ఆయన బాలికలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో సమస్యలు, మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడం, వసతిగృహంలో అసౌకర్యాలపై వారు తమ ఆవేదనను ఐటీడీఏ అధికారి దృష్టికి తీసుకొచ్చాారు. బాలికల సమస్యలను సదరు అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై స్పందించిన కలెక్టర్ మల్లికార్జున్.. ప్రధానోపాధ్యాయురాలు దేవమణిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:
India skills 2021: విశాఖలో ఇండియా స్కిల్స్.. అబ్బురపరిచిన యువత నైపుణ్యాలు