జీవో నెంబర్ 3 ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ మన్యంలో గిరిజన సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం నుంచి బంద్ కొనసాగుతోంది. ప్రధానంగా కొయ్యూరు, రాజేంద్రపాలెం, మంప తదితర ప్రాంతాల్లో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. జీవో నెంబర్ 3 పై ప్రభుత్వం పునరాలోచన చేసి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గిరిజనులు నిరసనలు తెలుపుతున్నారు.
జీవో నెంబర్ 3 అమలు కోరుతూ..విశాఖ మన్యంలో బంద్ - vishaka agency bandh
విశాఖ మన్యంలో గిరిజన సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం నుంచి బంద్ కొనసాగుతోంది. జీవో నెంబర్ 3ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..గిరిజనులు బంద్ నిర్వహిస్తున్నారు.