విశాఖ పరిధిలో ఉన్న నాలుగు వంతెనల సామర్ధ్య పరీక్షలను నిర్వహించనున్నారు. చెన్నైకి చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఎస్ఈఆర్సీ సంస్థకు అప్పగించింది. వంతెనలపై లోడ్ ఇతర అంశాలకు సంబంధించిన క్షేత్ర స్ధాయి పరీక్షలు నిర్వహించింది.
నెహ్రూ సెంటినరీ వంతెన బరువు మోయగలిగే సామర్ధ్యం కొంత మేర తగ్గగా... కేవలం లైట్ మోటార్ వాహనాలనే అనుమతించాలని సూచించింది. నెహ్రూ సెంటినరీ వంతెనపై నుంచి భారీ వాహనాల రాకపోకలు నిషేధిస్తూ విశాఖపట్నం పోర్టు ట్రస్టు నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని సూచించింది. లారీలు, బస్సులు ఇతర భారీ వాహనాల రాకపోకలను ఈ వంతెనపై నుంచి నిషేధిస్తున్నట్లు పోర్టు వెల్లడించింది. ఈ వంతెనపై కేవలం లైట్ మోటార్ వాహనాలే అనుమతిస్తామని పోర్టు ప్రకటించింది.
ఈ మార్గంలో ప్రయాణించే భారీ వాహనాలు నాల్కో, సౌత్ వెస్ట్ గేటు వైపు నుంచి అనకాపల్లి లెవల్ క్రాసింగ్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వైపు నుంచి నగరంలో వెళ్లేలా చర్యలు చేపట్టింది. నగరంలో నుంచి వచ్చే వాహనాలు నాల్కో సౌత్ వెస్ట్ కాబిన్ నుంచి అనకాపల్లి లెవల్ క్రాసింగ్ మీదుగా బిరాంప్ ఓల్డ్ అంబేడ్కర్ మార్గం గుండా వెళ్లాలని సూచించారు. మరమ్మతుల అనంతరం మాత్రమే అనుమతులు ఇస్తామని నగర ప్రజలు సహకరించాలని పోర్టు యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఈ సమాచారాన్ని ప్రభుత్వసంస్థలకు అందించారు.
ఇదీ చూడండి. కడప, ప్రకాశంలో 9 లక్షల రూపాయల విలువైన గుట్కా స్వాధీనం