ETV Bharat / state

విశాఖలో ఇన్వెస్ట్​ ఫెస్ట్​.. ఏర్పాట్లు పూర్తి - గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు 2023

Global Investors Summit: విశాఖలో రెండు రోజుల పాటు పెట్టుబడుల సదస్సు జరగబోతోంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సదస్సుకు దాదాపు 10 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరువుతారని అంచనా వేస్తున్నారు. ఈ సదస్సు ద్వారా రెండులక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలమని ప్రభుత్వం భావిస్తోంది.

Global Investors Summit
గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు
author img

By

Published : Mar 2, 2023, 10:15 PM IST

గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సుకు.. విశాఖ సిద్ధం

Global Investors Summit in Visakhapatnam: శుక్ర, శనివారాల్లో ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సుకు.. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు 2023 ఘనంగా ప్రారంభమైంది. దాదాపు 10 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరువుతారని భావిస్తున్న ఈ సదస్సు ద్వారా రెండులక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలమని ప్రభుత్వం చెబుతోంది.

కోట్ల రూపాయిలు వెచ్చించి ప్రాథమికంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. విస్తృతమైన ప్రాంగణం, ప్రత్యేకంగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యేందుకు ప్రత్యేక హాళ్లు సిద్దం చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ విశాఖ.. మంత్రులు, ప్రభుత్వాధికార్లతో ఏర్పాట్ల తీరును సమీక్షించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం మధ్యాహ్నం సదస్సులో పాల్గొంటారు. పారిశ్రామిక దిగ్గజం అంబానీ సహా ఇతర పారిశ్రామిక గ్రూపుల అధినేతలు రానుండడం సందడిని పెంచింది.

ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు కోసం ఏర్పాట్లు విస్తృతంగా చేశారు. అతిథులను ఆహ్వానించేందుకు వివిధ కమిటీలు పని చేస్తున్నాయి. ఆన్ లైన్​లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పాసుల జారీ ప్రక్రియ చురుగ్గా సాగింది. ప్రధానంగా పలు రాష్ట్రాల నుంచి దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని ప్రభుత్వ యంత్రాంగం వారి కోసం ప్రత్యేక బస, విందు వంటి ఏర్పాట్లను చేసింది.

నగర సుందరీకరణలో భాగంగా పలు కూడళ్లను తీర్చిదిద్దడం రహదార్ల మరమ్మతులు, విభాగినుల వద్ద పచ్చదనం ఉండేలా చర్యలు, బీచ్​ల సుందరీకరణ వంటి వాటికి దాదాపు వంద కోట్ల రూపాయిలు వెచ్చించారు. రాష్ట్ర మునిసిపల్‌ శాఖ ఇందుకోసం ప్రత్యేకంగా తీసుకున్న చర్యల వల్ల నగరం సుందరంగా ముస్తాబైందని మంత్రి వివరించారు.

ఈ సదస్సు ద్వారా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడుల ఒప్పందాలు జరుగుతాయని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఒప్పందాలలో ప్రధానంగా రెన్యువబుల్ ఎనర్జీ కి సంబంధించిన పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాధ్ వివరించారు.

పెట్టుబడుల సదస్సు రెండు రోజుల పాటు జరిగేందుకు వీలుగా షెడ్యూల్ రూపొందించింది. ఈ సదస్సులో దాదాపు 15 అంశాలపై చర్చలు ఏకకాలంలో జరుగుతాయి. నెదర్లాండ్స్, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, వియత్నాం,వెస్ట్రన్ ఆస్ట్రేలియా సెషన్లతో పాటుగా, స్పెషల్ హైలెవెల్ సెషన్ ఆన్ ట్రాన్స్ఫర్మేటివ్ ఫుడ్ సిస్టమ్స్ సెషన్ జరుగుతుంది. ప్లీనరీ హాల్ సహా నాలుగు సెమినార్ హాళ్లు ఉంటాయి.

ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు పెట్టుబడుల సదస్సు ప్రారంభ సమావేశం పిదప భోజన విరామం తర్వాత సెమినార్ హాళ్లలో సదస్సులు కొనసాగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు, రాయబారుల కోసం విశాఖ సాగర తీరాన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు ఈ విందు జరుగుతుంది.

ఈ సదస్సు వల్ల రాష్ట్రం ఆర్ధికంగా మరింతగా పురోగతిలో ఉంటుందని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో వివిధ యూనిట్లను నెలకొల్పనున్న వారికి అనుమతుల విషయంలోనూ, ప్రోత్సాహకాల అంశంలోనూ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామన్నారు. దాదాపు వందమందికిపైగా దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్ధల అధినేతలు, ప్రతినిధులు, వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక బృందాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. వారికి ముఖ్యమంత్రి విందును సాగర తీరంలో ఏర్పాటు చేస్తున్నారు.

శుక్రవారం రాత్రి ఈ విందు పరిమితంగా ఆహ్వానితులకు మాత్రమే అహ్వానిస్తున్నారు. ఉదయం ప్రధాన వేదిక వద్ద సదస్సు ప్రారంభ వేడుక ఉంటుంది. ఏపీ పెవిలియన్ సహా, ఇతర ఎగ్జిబిషన్ పెట్టుబడిదారులు సందర్శించేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. మధ్యాహ్నం ఎంవోయూలు కుదరనున్నాయి. మరుసటి రోజు ఉదయం సెషన్ పూర్తికాగానే, మధ్యాహ్నం భోజనానికి ముందే సదస్సు ముగియనుంది.

శనివారం ఉదయం 9.30 గంటల నుంచి పదిన్నర గంటల వరకు ప్లీనరీ వేదిక పైనే ఎంవోయూలు, పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి. మరో వైపు ఉదయం తొమ్మిది గంటల నుంచే సెమినార్ హాళ్లలో పెట్రోలియం, పెట్రోకెమికల్స్, హైయ్యర్ ఎడ్యుకేషన్, టూరిజం హాస్పిటాలిటీ, స్కిల్ డెవలప్ మెంట్, టైక్స్ టైల్స్ అప్పెరల్స్, ఫార్మాసుటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ అంశాలపై సదస్సులు కొనసాగుతాయి. ప్రతి సెమినార్ కి 45 నిమిషాలను నిర్దేశించారు. శనివారం ఉదయం 10.30 గంటలకు అన్ని సెమినార్​లు పూర్తవుతాయి. తర్వాత సాంస్కృతిక ప్రదర్శన తర్వాత సదస్సు ముగింపు సమావేశం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు ఉంటుంది. సదస్సు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి తాడేపల్లి బయలుదేరి వెళ్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.