ETV Bharat / state

Police Alert: మావోయిస్టు కీలక నేత అరెస్టుతో విశాఖ పోలీసులు అప్రమత్తం - మావోయిస్టు కీలక నేత అరెస్టుతో పోలీసులు అప్రమత్తం వార్తలు

ఏవోబీ(AOB)లో మావోయిస్టు కీలక నేత అరెస్టుతో.. విశాఖ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. పాడేరులో పోలీసు బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.

Visakham police are on high alert with the arrest of a Maoist leader
మావోయిస్టు కీలక నేత అరెస్టుతో విశాఖ పోలీసులు అప్రమత్తం
author img

By

Published : Sep 15, 2021, 8:33 PM IST

ఏవోబీ(AOB)లో మావోయిస్టు కీలక నేత అరెస్టుతో.. విశాఖ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. పాడేరులో పోలీసు బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.

మావో అగ్రనేత అరెస్ట్

ఏఓబీలోని కొరాపుట్‌, మల్కాన్‌గిరి, విశాఖపట్నం జిల్లాల్లో.. మావోయిస్టు కీలకనేత దుబాసి శంకర్‌ అలియాస్‌ మహేందర్‌ అలియాస్‌ అరుణ్‌ అలియాస్‌ రమేష్‌ను ఒడిశాలో సోమవారం అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ అభయ్‌ తెలిపారు. ఆయన మంగళవారం.. భువనేశ్వర్‌లో విలేకర్లతో మాట్లాడారు. 'కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పేటగడ అటవీ ప్రాంతంలో ఎస్‌ఓజీ, జిల్లా వాలంటరీ దళం, బీఎస్‌ఎఫ్‌, రాష్ట్ర పోలీసులు కూంబింగ్‌ చేసి.. నోయరో గ్రామంలో శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడివద్ద ఇన్సాస్‌ రైఫిల్‌, 10రౌండ్ల బుల్లెట్లు, ఇతర సామగ్రి, రూ.35,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఆచూకీ చెప్పినవారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని గతంలో ప్రకటించాం.' అని ఒడిశా డీజీపీ అభయ్‌ తెలిపారు.

తీగలమెట్ట ఘటనతో సంబంధం..

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం చెట్లనర్సంపల్లికి చెందిన శంకర్‌ 1987 నుంచి తీవ్రవాద ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతని భార్య భారతక్క 2016లో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారని డీజీపీ తెలిపారు. ఈ ఏడాది విశాఖపట్నం జిల్లా తీగలమెట్టలో జరిగిన ఎదురుకాల్పుల్లో అతడి హస్తం ఉందన్నారు. 2010లో గోవిందపల్లిలో మందుపాతర పేలి 11 మంది ఒడిశా పోలీసులు, అనంతరం చిత్రకొండలోని జానిగుడలో జరిగిన కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మరణించారని, ఆ ఘటనలతో అతడికి సంబంధం ఉందని తెలిపారు. శంకర్‌ దుబాసీ 1987లో పార్టీలో చేరి.. 2003 నాటికి ఎస్‌జడ్‌సీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. అప్పటి నుంచి ఏఓబీలోనే పనిచేస్తున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కొరాపూట్‌ జిల్లాల్లో 20, తెలంగాణ రాష్ట్ర పరిధిలో 24 కేసులు శంకర్‌పై ఉన్నాయి.

రూ. 20 లక్షల రివార్డు

రూ. 20 లక్షల రివార్డు ఉన్న ఓ మావోయిస్టును ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. దుబాసి శంకర్ అనే ఈ మావో.. భద్రతాదళాలపై భీకర దాడులు జరిపాడు. 2009లో దమన్​జోడిలో 10 మంది సీఐఎస్​ఎఫ్​ అధికారులను హత్య చేసిన ఘటనలో శంకర్​ నిందితుడిగా ఉన్నాడు.

ఒడిశా పోలీసులు కొరాపూట్‌ జిల్లాలో రెండు రోజుల క్రితం మావోయిస్టు నేతలు దుబాసీ శంకర్‌ అలియాస్‌ మహేందర్‌, కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారని వారిని వెంటనే విడిచిపెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.చిట్టిబాబు, చిలుక చంద్రశేఖర్‌, తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్‌, ఎన్‌.నారాయణరావు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండు చేశారు.

ఇదీ చదవండి:

JAGAN BAIL: జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.