విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను శిబిరాలకు తరలించారు. సాయంత్రం మంత్రులు చెక్కులు అందజేసిన తర్వాత ఇళ్లకు వెళ్లాలని తమపై అధికారులు ఒత్తిడి తెచ్చారని బాధితులు చెబుతున్నారు. తమ ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని అయినా పోలీసులు, అధికారులు బలవంతంగా తరలిస్తున్నారని వారు వాపోయారు.
సింహచలంలో 21 కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ వైద్య సదుపాయం కూడా కల్పించినట్లు విశాఖ అర్బన్ తహసీల్దార్ జ్ఞానవేణి తెలిపారు.
ఇదీచూడండి.