బీహార్ నుంచి విశాఖకు పనుల కోసం వచ్చిన వలస కార్మికులు.. సైకిళ్లపై తమ స్వస్థలాలకు బయలు దేరారు. హెచ్పీసీఎల్ రిఫైనరీలో పనిచేసే వీరు.. తమ ఇళ్లకు వెళ్ళడానికి ఇలా సైకిల్ మార్గం ఎంచుకున్నారు. వారి వద్ద ఉన్న సొమ్ముతో కొత్త సైకిళ్లు కొనుకున్నారు.
ఒక్కొక్కరు పది లీటర్ల మంచి నీటిని సైకిల్ కు కట్టుకుని రాత్రి వేళల్లో ప్రయాణం చేస్తూ బీహార్ లోని సలోమీ జిల్లాకు బయలు దేరారు. 14 మంది ఒక బృందంగా ప్రయాణం చేస్తున్నారు. నడిచి వెళ్లడం కంటే సైకిల్ పై వేగంగా, సురక్షితంగా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
ఇదీ చదవండి: