ETV Bharat / state

ఈనెల 20న 'చలో స్టీల్ ప్లాంట్'.. 26న భారత్ బంద్​కు కార్మిక సంఘాల పిలుపు - విశాఖ తాజా వార్తలు

ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నట్లు కార్మిక, ప్రజా సంఘాల పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా ఈనెల 20న 'చలో స్టీల్ ప్లాంట్'.. 26న భారత్ బంద్​కు పిలుపునిచ్చామని నాయకులు వెల్లడించారు.

visakha steel plant employees
26న భారత్ బంద్​కు కార్మిక సంఘాల పిలుపు
author img

By

Published : Mar 17, 2021, 7:46 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడంపై వెనక్కి తగ్గకపోవడంతో కార్మిక, ప్రజాసంఘాలు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి నిర్ణయించాయని కమిటీ ఛైర్మన్ ఎం. జగ్గునాయుడు తెలిపారు. ఈ మేరకు ఈనెల 20న పెద్ద ఎత్తున 'చలో స్టీల్ ప్లాంట్​' నిర్వహించనున్నామని.. 26న భారత్ బంద్​కు పిలుపునిచ్చామని అన్నారు.

ఉద్యమంలో భాగంగా ఈనెల 30 నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నామని జగ్గు నాయుడు ప్రకటించారు. సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎన్. మన్మదరావు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకుడు ఎస్కే రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.