విశాఖ జిల్లా అనకాపల్లిలో లాక్డౌన్ను జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ పరిశీలించారు. డ్రోన్ కెమెరా ద్వారా చేపడుతున్న తనిఖీల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ, ఇతర అత్యవసరాలు ఉంటే పోలీసుల వాట్సాప్ నెంబర్ 9505200100కి వివరాలు తెలిపాలని సూచించారు. వెంటనే ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో పరిశీలన చేసి అత్యవసర ప్రయాణాల కోసం పోలీసులు పాస్ ఇస్తారని వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో గిరిజనులకు జీసీసీ ద్వారా నిత్యావసర సరకులు అందించేలా పోలీసులు చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కరోనా అనుమానితులకు పరీక్షలు త్వరగా పూర్తి చేయాలి'