ETV Bharat / state

మంత్రి రోజా క్షమాపణ చెప్పాలంటూ.. జనసేన వీర మహిళల ఆందోళన - latest news on Janasena Veera Mahila Counter

Janasena Veera Mahila Powerful Counter: వారాహి పేరుతో కొత్త వాహనం, కలర్‌ఫుల్‌ చొక్కా వేసుకుని పవన్ కల్యాణ్ వస్తే భయపడేవారు ఎవరూ లేరని.. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై జనసేన వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసారు. నోటికి వచ్చినట్టు రోజా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని విశాఖ వీర మహిళలు  హెచ్చరించారు. రోజా ఎక్కడ ఉంటే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపణలు చేశారు.

జనసేన వీర మహిళలు
Janasena Veera Mahila
author img

By

Published : Dec 14, 2022, 5:17 PM IST

Janasena women's wing: మంత్రి రోజాపై జనసేన వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వారాహి వాహనంపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసారు. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రోజా ఎక్కడ ఉంటే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. రోజా నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని విశాఖ వీర మహిళలు హెచ్చరించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త పసుపులేటి ఉష కిరణ్ నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

జనసేన వీర మహిళలు

'పవన్ కల్యాణ్ తన వాహనానికి వారాహికి అని పేరు పెట్టిన తరువాత వైసీపీ నేతలకు వెన్నులో వనుకుపుడుతోంది. రోజా తమ నాయకుడి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నారాహి ఆ.. లేక వారహి అని అంటూ రోజా ఆరోపిస్తున్నారు.. అసలు రోజా ఎక్కడి నుంచి వచ్చింది.'- పసుపులేటి ఉష కిరణ్, విశాఖ జనసేన సమన్వయ కర్త

రోజా ఏమన్నారంటే.. : వారాహి పేరుతో కొత్త వాహనం, కలర్‌ఫుల్‌ చొక్కా వేసుకుని పవన్ కల్యాణ్ వస్తే భయపడేవారు ఎవరూ లేరని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మంచి కంటెంట్ లేకపోతే సినిమా ఫ్లాప్ అయినట్టుగానే.. జనసేన కూడా అట్టర్‌ఫ్లాప్ అవుతుందన్నారు. పవన్ వేరే పార్టీ జెండా మోస్తుంటే చూసి జనాలు నవ్వుకుంటున్నారని రోజా విమర్శించారు. విశాఖ లో జగనన్న సాంస్కృతిక సంబరాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.