ETV Bharat / state

దోచేయడానికి కూడా ఓ ప్లానింగ్, ఒక పద్దతి, విజన్ ఉండాలి- దసపల్లా భూములను కొట్టేయడంలో వైసీపీ నేతల రూటే సపరేటు - వైఎస్సార్​సీపీ అక్రమాలు

Visakha Dasapalla Land Irregularities: విశాఖలోని దసపల్లా భూములు వైఎస్సార్​సీపీ నేతలకు రసగుల్లా లాగా మారిపోయాయి. అవకాశం కోసం ఎదురు చూస్తూ, దొరక్కపోతే సృష్టించికుని మారి భూములను చప్పరించేస్తున్నారు. ఇప్పటికి 3 వేల కోట్ల రూపాయల విలువైన 15 ఎకరాల భూములను స్వాహా చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు కుంభకోణమంటూ జగన్‌ గగ్గోలు పెట్టి. అధికారంలోకి రాగానే ఎంచక్కా దోచేసుకున్నారు.

visakha_dasapalla_land_irregularities
visakha_dasapalla_land_irregularities
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2023, 9:28 AM IST

Updated : Dec 30, 2023, 11:24 AM IST

Visakha Dasapalla Land Irregularities: ఒక ప్లానింగు, ఒక పద్ధతి, ఒక విజన్‌, అంటూ తెలుగు సినిమాలో నటుడు రావు రమేశ్​ చెప్పిన డైలాగ్‌ ఇది. వైఎస్సార్​సీపీ వాళ్లకు ఇది సరిగ్గా నప్పుతుంది. తిరుమలలో పింక్‌ డైమండ్‌ అయినా, విశాఖలో దసపల్లా భూములైనా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో జరిగిపోతున్నట్లు భ్రమింపజేస్తారు. అదేంటో మరి అధికారంలోకి రాగానే తూచ్‌ అని నాలుక కొరక్కుని, వాళ్లే నేరుగా రంగంలోకి దిగుతారు. పక్కా స్కెచ్‌తో సొత్తు కొల్లగొట్టేస్తారు. అన్యాయాలు, అక్రమాల సబ్జెక్టుల్లో జగన్‌ ముఠాకు నిరభ్యంతరంగా ఇచ్చేయొచ్చు.

వైఎస్సార్​సీపీ నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు, విశాఖపట్నం నడిబొడ్డునున్న విలువైన దసపల్లా భూములు ప్రైవేటు పరం అవుతున్నాయని గుండెలుబాదుకున్నారు. సీబీఐతో దర్యాప్తు జరిపించాలని యాగీ చేశారు. ఆ తర్వాత వైఎస్సార్​సీపీ అధికారంలోకి రాగానే సీన్‌ మారిపోయింది. టీడీఆర్​ బాండ్ల కుంభకోణాన్ని దసపల్లా భూముల్లోకీ తీసుకువచ్చారు.

వై. ఎస్​ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నసమయంలో, విశాఖ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దసపల్లా భూముల్ని తలో వెయ్యి చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాలుగా పంచుకునేందుకు పథకం పన్నారు. ఆ విషయం బయటకు పొక్కి దుమారం రేగడంతో వెనక్కి తగ్గారు. ఇప్పటి ప్రభుత్వ పెద్దలు ఆ పథకాన్ని మరో మార్గంలో అమలు చేశారు.

దసపల్లా భూముల్లో రహదారి విస్తరణపై హైకోర్టు స్టే - ప్రభుత్వానికి చెంపపెట్టు : మూర్తియాదవ్‌

అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి చేతికి మట్టి అంటకుండా అత్యంత విలువైన భూముల్ని కొట్టేయడంలో వైఎస్సార్​సీపీ నేతల తెలివే తెలివి. దానికి దసపల్లా భూముల ఉదంతమే ఉదాహరణ. దసపల్లా సంస్థానానికి చెందిన 15 ఎకరాల భూములు విశాఖ మహానగరం మధ్యలో ఉన్నాయి. వాటిని ఆనుకునే ప్రభుత్వ అతిథిగృహం సర్క్యూట్‌హౌస్, తూర్పు నౌకాదళ ప్రధానాధికారి నివసించే నేవీ హౌస్‌ ఉన్నాయి.

దసపల్లా భూములపై ప్రభుత్వానికి, దసపల్లా సంస్థాన వారసురాలు రాణి కమలాదేవికి మధ్య ఎప్పటి నుంచో న్యాయవివాదాలు నడుస్తున్నాయి. అక్కడ నాలుగు సర్వే నెంబర్లలోని 60 ఎకరాల భూమిపై ప్రభుత్వం తనకు 1958లో గ్రౌండ్‌రెండ్‌ పట్టా ఇచ్చిందని రాణి కమలాదేవి చెబుతున్నారు. అందులో ప్రస్తుతం 15 ఎకరాలే మిగిలింది. ఆ భూమిని ఆమె నుంచి పలువురు కొనుగోలు చేశారు. వాటిపై కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వాటిని నిషిద్ధ జాబితాలో ఉంచి కాపాడుతోంది.

విశాఖలో దసపల్లా భూముల టీడీఆర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి : జనసేన నేత మూర్తి యాదవ్

ఆ 15 ఎకరాల్లో తమకు వాటా ఉన్నట్టు కమలాదేవి సహా మొత్తం 64 మంది చెబుతున్నారు. దసపల్లా భూములపై ఆమెకు గ్రౌండ్‌రెంట్‌ పట్టా ఇవ్వడం చెల్లదని 1998లో సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు. దానిపై కమలాదేవి హైకోర్టుకి వెళ్లగా ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వం అప్పీల్‌ చేయడంతో వివాదం సుప్రీం కోర్టుకి చేరింది.

సుప్రీంకు చేరిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన పత్రాలను సకాలంలో అందించకపోడంతో హైకోర్టు తీర్పునే సుప్రీం కోర్టు సమర్థించింది. అయినప్పటికీ అవి ప్రభుత్వ భూములేనని స్పష్టం చేస్తూ, 2015లో అప్పటి కలెక్టర్‌ వాటిని నిషిద్ధ జాబితాలో కొనసాగించారు. వాటిని ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ రాణి కమలాదేవి 2016లో మళ్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అప్పట్నుంచి అది పెండింగ్‌లో ఉంది.

Battle Between YV vs Vijayasai for Dasapalla Lands: దసపల్లా భూముల కోసం వైవీ వర్సెస్ విజయసాయిల మధ్య అంతర్యుద్ధం

వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక ఆ భూముల్ని కాపాడేందుకు ప్రభుత్వం తరపున కోర్టులో న్యాయపోరాటం చేయాల్సింది పోయి, వాటిని కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఆ భూముల్ని నిషిద్ధ జాబితా నుంచి తొలగించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో దిశానిర్దేశం చేయాలంటూ, 2021 ఆగస్టులో భూ పరిపాలన ప్రధాన కమిషర్‌కు విశాఖ కలెక్టర్‌తో లేఖ రాయించారు.

ప్రపంచంలోనే నూతన ఒప్పందం: మరోపక్క వైఎస్సార్​సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వ్యక్తులు ఏర్పాటు చేసిన అష్యూర్‌ డెవలపర్స్‌ అనే సంస్థ, దసపల్లా భూముల యజమానులుగా చలామణి అవుతున్న 64 మందితో 2021 జూన్, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో డెవలప్‌మెంట్‌ ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూ యజమానులకు కేవలం 29 శాతం, డెవలపర్లకు 71 శాతం వాటా చొప్పున ఒప్పందం జరిగింది.

నిషిద్ధ జాబితాలో ఉండగానే దసపల్లా భూముల్లో పనులు.. చోద్యం చూస్తున్న అధికారులు

దసపల్లా భూములపై అడ్వకేట్‌ జనరల్‌ను, న్యాయ విభాగాన్నీ సంప్రదించామని 2009లో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఆ భూములపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ సీసీఎల్​ఏ జి. సాయిప్రసాద్‌ 2022 సెప్టెంబరులో మెమో జారీ చేశారు. అప్పటికే దసపల్లా భూములపై తీవ్ర దుమారం కావడం, వాటిని నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తే మరింత వివాదమవుతుందున్న ఉద్దేశంతో సర్కారు ఇంకో ఎత్తుగడ వేసింది.

నేరుగా కలెక్టర్‌తో ఉత్తర్వులు ఇప్పించకుండా రాణి కమలాదేవి న్యాయవాదితో హైకోర్టులో ఒక పిటిషన్‌ వేయించారు. ఆ భూముల్ని 22(ఎ) నుంచి తొలగించాలని కోరుతూ 2016లో రాణి కమలాదేవి వేసిన పిటిషన్‌ను విచారించాలని ఆమె తరపు న్యాయవాది హైకోర్టుని ఆశ్రయించారు. 2023 జనవరిలో దానిపై విచారణ జరిపిన హైకోర్టు గతంలో డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వుని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విశాఖ దసపల్లా భూముల స్వాహాకు వడివడిగా అడుగులు..

ఆ భూములు ప్రభుత్వానికి చెందుతాయని అడ్వకేట్‌ జనరల్‌గానీ, ఇతర ప్రభుత్వ న్యాయవాదులుగానీ వాదనలు వినిపించలేదు. ప్రభుత్వం, హైకోర్టుల నుంచి అనుకూలంగా ఉత్తర్వులు రావడంతో, ఆ భూముల్ని నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రపంచంలో ఎక్కడైనా స్థల యజమానికి, డెవలపర్‌కి మధ్య 50:50 నిష్పత్తిలో ఒప్పందం ఉంటుంది. అత్యంత విలువైన భూముల్లో స్థల యజమానికి వాటా మరింత ఎక్కువ ఉంటుంది. కానీ దసపల్లా భూముల యజమానులుగా చెలామణి అవుతున్న వారితో అష్యూర్‌ సంస్థ చేసుకున్న ఒప్పందం చూస్తేనే ఎంత పద్ధతిగా ప్లాన్‌ చేశారో అర్థమవుతోంది.

daspalla lands దసపల్లా భూములు ప్రైవేటుపరం?

అంతా ఆయన కుటుంబ సభ్యుల కంపేనిలకే: యజమానులుగా చెబుతున్న వారితో డెవలప్‌మెంట్‌ ఒప్పందం చేసుకున్నది విజయసాయిరెడ్డి సన్నిహితుల కంపెనీ కాగా, దాని రిజిస్ట్రేషన్‌కు అవసరమైన నిధులు ఆయన కుమార్తె, అల్లుడికి చెందిన అవ్యాన్‌ రియల్ట్స్‌ సంస్థ నుంచి వెళ్లాయన్నది ప్రతిపక్ష నాయకుల ఆరోపణ. అక్కడ 75,939 చదరపు గజాల స్థలం అందుబాటులో ఉందని, వాటిలో 27.55 లక్షల చదరపు అడుగుల్లో నివాస, వాణిజ్య భవనాలు నిర్మిస్తామని ఒప్పందంలో పేర్కొన్నారు. స్థల యజమానులుగా చెలామణి అవుతున్న వారికి కేవలం 7లక్షల 96వేల 580 చదరపు అడుగులు అంటే 29 శాతమే ఇస్తామని తెలిపారు. పైగా వాణిజ్య భవనాల్లో వారికి ఎలాంటి వాటా ఉండదట.

బాండ్ల పేరుతో మరింత కొట్టేసేందుకు: ప్రభుత్వానికి చెందాల్సిన 2 వేల కోట్లకుపైగా విలువైన దసపల్లా భూముల్ని కొట్టేసిందే కాక టీడీఆర్‌ బాండ్ల పేరుతో మరింతగా పిండేసేందుకు అధికార పార్టీ ప్రబుద్ధులు పన్నాగం పన్నారు. అంటే, ఒక దెబ్బకు నాలుగైదు పిట్టల్ని కొట్టే యత్నమన్నమాట. నగరాలు, పట్టణాల్లో రహదారుల విస్తరణ, ఇతర ప్రజావసరాల కోసం చేపట్టే ప్రాజెక్టుల కోసం ప్రైవేటు స్థలాల్ని కొంత మేర తీసుకోవాల్సి వచ్చినప్పుడు, భూ యజమానికి పరిహారాన్ని నగదు రూపంలో కాకుండా, బదిలీకి వీలున్న అభివృద్ధి హక్కు పత్రాలు టీడీఆర్​ బాండ్ల రూపంలో ఇస్తారు.

వాల్తేరు క్లబ్‌, దసపల్లా భూములపై సర్కారు దృష్టి

టీడీఆర్​ బాండ్ల ఉదాహరణ: రోడ్డు విస్తరణలో ఒక వ్యక్తికి చెందిన 100 చదరపు గజాల స్థలం పోతుంటే, అతనికి 1:4 నిష్పత్తిలో అంటే 400 చదరపు గజాలకు టీడీఆర్​ బాండ్లు ఇస్తారు. అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువనే ప్రామాణికంగా తీసుకుని బాండ్‌ల విలువను నిర్ధారిస్తారు. భూమి యజమాని ఆ బాండ్‌లను వేరేవారికి విక్రయించుకోవచ్చు. అపార్ట్‌మెంట్‌లపై పరిమితికి మించి అదనపు అంతస్తు వేయాలనుకున్నవారు ఈ టీడీఆర్‌ బాండ్‌లను కొనుగోలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దసపల్లా భూముల్ని కొట్టేసినవారు, టీడీఆర్‌ బాండ్ల రూపంలోనూ కోట్లలో లబ్ధిపొందేందుకు ఎత్తుగడ వేశారు.

ఈ భూముల మధ్యలో ఉన్న 40 అడుగుల రోడ్డుని మాస్టర్‌ప్లాన్‌-2024లో 100 అడుగులుగా మార్చేందుకు ప్రతిపాదన పెట్టించారు. నగరంలో జీవీఎంసీ అభివృద్ధి చేయాల్సిన మాస్టర్‌ప్లాన్‌ రోడ్లు ఇంకేమీ లేనట్టు, ఆగమేఘాల మీద ఈ రహదారిని 100 అడుగులకు విస్తరించేలా ప్రతిపాదన సిద్ధం చేయించారు. 4కోట్ల 64లక్షలు వెచ్చించి ఆ రోడ్డు విస్తరించే ప్రతిపాదనకు జీవీఎంసీ సమావేశంలో ఆమోదం తెలిపారు.

YSRCP: విశాఖలో ఎంపీ భూమాయ.. కారుచౌకగా భూములు స్వాహా

నాలుగు రెట్ల టీడీఆర్​ బాండ్లు: రోడ్డు విస్తరణ వల్ల నగర ప్రజలకు వచ్చే ప్రత్యేక ప్రయోజనమేమీ లేదు. కానీ, దసపల్లా భూములకు వాణిజ్య విలువ మరింత పెరుగుతుంది. అక్కడ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేందుకు అనుమతులు తీసుకోవాలన్నా 100 అడుగుల రోడ్డు ఉండాలి. పైగా విస్తరణ వల్ల పోయే భూమికి నాలుగు రెట్లు ఎక్కువగా టీడీఆర్‌ బాండ్‌లు తీసుకోబోతున్నారు.

అంటే బహుళ అంతస్తుల భవననాలకు అనుమతులు, ఇతర ఫీజుల నిమిత్తం జీవీఎంసీకి చెల్లించాల్సిన మొత్తాన్ని, టీడీఆర్​ బాండ్ల రూపంలో రాబట్టేందుకు ఎత్తుగడ వేశారన్నమాట. దీన్నిబట్టి చేతికి మట్టి అంటకుండా, చేతి చమురు వదలకుండా కోట్లాది విలువైన భూములను కొట్టేసేందుకు వైఎస్సార్​సీపీ పెద్దలు ఎంత పక్కాగా ప్లాన్‌ చేశారో అర్థమవుతోంది.

విశాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్న దసపల్లా హిల్స్​..

వైఎస్సార్​సీపీ నేతలకు రసగుల్లా లాగా దసపల్లా భూములు - ప్రతిపక్షంలో మాత్రం గగ్గోలు

Last Updated : Dec 30, 2023, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.