మన్యంలో విశాఖ జిల్లా పాలనాధికారి వినయ్ చంద్ పర్యటించారు. అరకు మండలంలోని సుంకరమెట్ట గ్రామ సచివాలయంలో సిబ్బంది పనితీరుని పరిశీలించారు. వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలు రెండు రోజుల్లో అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సచివాలయాలు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్లతో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుందని చెప్పారు.
విజయనగరం జిల్లాను కలుపుతూ నిర్మించిన 516ఈ జాతీయ రహదారి గిరిజన ప్రాంతానికి వరమని ఆయన అన్నారు. రహదారి నిర్మాణంతో పర్యాటక రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. పీఎన్జీఎస్వై పథకం ద్వారా రోడ్ల నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరాకు రూ.2,25,000 అందిస్తామని చెప్పారు. అనంతరం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇదీ చదవండి: విశాఖ అతిథి గృహంలో హోంమంత్రికి పోలీసుల గౌరవ వందనం