జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను మొదటగా కొవిడ్ బారిన పడిన వారికి, వైద్య సిబ్బందికి వేస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ తెలిపారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు కావాల్సిన కొవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను భద్రపరిచేందుకు విశాఖలో కోల్డ్ చెయిన్ ఏర్పాటు చేశామని అన్నారు. ఇందుకోసం అధికార అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. నాలుగు జిల్లాలకు సంబంధించి కొవిడ్ వ్యాక్సిన్ సరాఫరాకు విశాఖ కేంద్రంగా ఉంటుందని జిల్లా పాలనధికారి వెల్లడించారు. 17 లక్షల డోస్‌లను నిల్వ చేసే స్టోరేజీ సామర్థ్యం ఉందని అన్నారు.
మొదటి దశలో 34,767 మందిని అధికారికంగా గుర్తించామని.. వీరిలో వైద్య సిబ్బందే 18,983 మంది ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కొవిన్ అనే సాఫ్ట్‌వేర్‌లో ఇప్పటికే వీరందరి పేర్లు నమోదు చేశామన్నారు. 50 సంవత్సరాలు పైబడిన వారికి.. ఆ తర్వాత బీపీ షుగర్ , దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వ్యాక్సిన్ అందజేస్తామని అన్నారు.
ఇదీ చదవండి: