నూతన సంవత్సవంలో విశాఖను ఆదర్శవంతంగా నిలిపే అనేక ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ సృజన వెల్లడించారు. గత ఏడాది కాలంలో కొవిడ్ మహమ్మారి కారణంగా విశాఖ అనేక సవాళ్లను తట్టుకుని నిలిచిందన్నారు. అనేక ఇంజినీరింగ్ ప్రాజెక్టులపై కొవిడ్ ప్రభావం ఉందని వివరించారు. ప్రస్తుతం పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు. శుద్ధి చేసిన నీటిని తిరిగి వినియోగించడం, మల్టీ లెవల్ కార్ పార్కింగ్ వంటి అంశాలు విశాఖకు ఎంతో పేరు తీసుకువస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ...తగ్గిన పుష్పగుచ్ఛాల ప్రాధాన్యం.. సాగని పూల వ్యాపారం