విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం స్వచ్చ విమానాశ్రయంగా గుర్తింపు పొందినప్పటికీ, రన్వే చుట్టూ పెద్ద డ్రైనేజీలు ఉన్నాయి. వీటి వలన రాత్రి వేళల్లో విమానశ్రయ పరిసరాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. విమానాశ్రయంలో ఈ దోమల బెడదను అరికట్టలేకపోయారు. మరిన్ని అంతర్జాతీయ సర్వీసులను ఆరంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన విమానశ్రయ అధికారులకు కొత్త సమస్యను తెచ్చింది. దోమల కారణంగా 2 రోజుల క్రితం ఒక ఇండిగో విమానం ఏకంగా గంట పాటు ఆలస్యమైంది.