ETV Bharat / offbeat

దసరా స్పెషల్​: ఘుమఘుమలాడే మద్రాస్​ స్టైల్​ "మటన్​ బకెట్​ బిర్యానీ" - తిన్నారంటే జిందగీ ఖుష్ అయిపోతుంది!! - HOW TO MAKE MUTTON BUCKET BIRYANI

దసరా అంటే.. పిండి వంటలతోపాటు నోరూరించే.. ఘాటెక్కించే మసాలాల ఘుమఘమలూ ఉంటాయి. ఇక పండక్కి నాన్​వెజ్​లో మటన్​ కామన్​. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఈసారి వెరైటీగా చేయండి.. టేస్ట్​ అద్దిరిపోతుంది.

Mutton Bucket Biryani at Home
Mutton Bucket Biryani at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 4:57 PM IST

Mutton Bucket Biryani at Home: "దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా" అంటూ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ సరదగా గడుపుతుంటారు. ఇక నవరాత్రుల వేళ అమ్మవారిని దర్శించుకోవడం, పిండి వంటలు చేసుకోవడం కామన్​. అయితే కేవలం పండగ నాడు పిండి వంటలు మాత్రమే కాదు.. ఘాటెక్కించే మసాలాల ఘుమఘములు నషాళానికి ఎక్కాల్సిందే. ఇక పండక్కి నాన్​వెజ్​లో మటన్​, చికెన్​ కామన్​. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఈసారి వెరైటీగా మద్రాస్​ స్టైల్లో మటన్​ బకెట్​ బిర్యానీ చేయండి. రుచి అద్దిరిపోవాల్సిందే. మరి ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మటన్​ మారినేట్​ కోసం :

  • బిర్యానీ కట్​ మటన్​ - అర కిలో
  • కారం - అర టీ స్పూన్​
  • పసుపు - అర టీ స్పూన్​
  • ఉప్పు - సరిపడా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టేబుల్​ స్పూన్​
  • జాజికాయ పొడి - 2 చిటికెళ్లు
  • కొత్తిమీర, పుదీనా తరుగు - పిడికెడు
  • పెరుగు - అర కప్పు
  • నిమ్మకాయ - 1
  • ధనియాల పొడి - 1 టీస్పూన్​
  • గరం మసాలా - 1 టీ స్పూన్​
  • నూనె - పావు కప్పు

మటన్​ కర్రీకి:

  • నెయ్యి - 4 టేబుల్​ స్పూన్లు
  • నూనె - 3 టేబుల్​ స్పూన్లు
  • అనాస పువ్వులు - 2
  • మిరియాలు -10
  • దాల్చిన చెక్క - 1 ఇంచ్​
  • బిర్యానీ ఆకులు - 2
  • బూజు పువ్వు - కొద్దిగా
  • లవంగాలు - 8
  • యాలకులు - 5
  • షాజీరా - అర టేబుల్​ స్పూన్​
  • ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 4
  • టమాటలు - 2
  • వేడి వేడి నీరు - 750 ml
  • పుదీనా, కొత్తిమీర తరుగు - కొద్దిగా

బిర్యానీ కోసం:

  • బాస్మతీ రైస్​ - 2 కప్పులు
  • నీరు - 2 లీటర్లు
  • లవంగాలు - 5
  • దాల్చిన చెక్క - 2
  • మిరియాలు - 10
  • అనాస పువ్వులు - 2
  • యాలకలు - 3
  • బిర్యానీ ఆకులు- 2
  • షాజీరా - 1 టీ స్పూన్​
  • ఉప్పు - 3 టేబుల్​ స్పూన్లు

  • కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 2
  • ఫుడ్​ కలర్​, రోజ్​ వాటర్​ - 1 టేబుల్​ స్పూన్​
  • నెయ్యి - 4 టేబుల్​ స్పూన్లు

తయారీ విధానం:

  • ముందుగా ఓ గిన్నెలోకి మటన్​ తీసుకోవాలి. అందులోకి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్​, జాజికాయ పొడి, కొత్తిమీర, పుదీనా తరుగు, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, నిమ్మరసం.. వేసి ముక్కలకు బాగా పట్టేలా కలిపి ఫ్రిడ్జ్​లో ఓ మూడు గంటల పాటు పెట్టాలి. వీలైతే రాత్రంతా పెట్టుకుంటే కూర రుచి ఇంకా పెరుగుతుంది.
  • మూడు గంటల తర్వాత మందపాటి గిన్నెను స్టవ్​ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోకి నెయ్యి, నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అనాస పువ్వులు, మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, షాజీరా, బూజు పువ్వు వేసి ఓ 5 సెకన్లు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కట్​ చేసుకున్న మిర్చి, మారినేట్​ చేసుకున్న మటన్​ వేసి కలిపి హై ఫ్లేమ్​ మీదు మటన్​లోని నీరు ఇంకిపోయి.. నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న మటన్​కు సుమారు 15 నిమిషాల సమయం పట్టిద్ది.
  • ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి మటన్​ ముక్కలు లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత టమాట పేస్ట్​ లేదా సన్నగా కట్​ చేసుకున్న ముక్కలు వేసి నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత వేడి వేడి నీరు పోసి కలిపి మూత పెట్టి మటన్​ ముక్కను 80 శాతం ఉడికించుకోవాలి. ఇలా ముక్క ఉడకటానికి సుమారుగా 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది.
  • ముక్క 80 శాతం ఉడికింది అనుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.
  • ఇప్పుడు మరో స్టవ్​ మీద గిన్నె పెట్టి అందులో రెండు లీటర్ల నీరు పోసి మరిగించుకోవాలి.
  • నీరు మరుగుతున్నప్పుడు లవంగాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, షాజీరా వేసుకోవాలి.
  • ఇప్పుడు మసాలా దినుసులు మరుగుతున్నప్పుడు ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఈ స్టేజ్​లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి.
  • ఉప్పు కరిగి నీరు మసులుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి మరిగించుకోవాలి.
  • ఆ తర్వాత గంట సేపు నానబెట్టిన బాస్మతీ బియ్యం, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి మంటను హై ఫ్లేమ్​లో పెట్టి 80 శాతం ఉడికించుకోవాలి.
  • అన్నం ఉడికిన తర్వాత జల్లెడ సాయంతో కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉడికించి పెట్టుకున్న మటన్​ మిశ్రమంపై లేయర్​లా పరచుకోవాలి. ఇలా అన్నం మొత్తాన్ని లేయర్​లా వేసుకోవాలి.
  • ఆ తర్వాత గిన్నె అంచులకు అంటిన మసాలా మిశ్రమాన్ని తుడిచి.. బియ్యంపై ఫుడ్​ కలర్​, రోజ్​వాటర్​, నెయ్యి, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి మూత పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ధమ్​ బయటికి పోకుండా మూత పెట్టి హై-ఫ్లేమ్​ మీద 5 నిమిషాలు, లో-ఫ్లేమ్​ మీద మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్​ ఆఫ్​ చేసి ఓ 20 నిమిషాలు తర్వాత చూస్తే.. ఘుమఘములాడే మద్రాస్​ స్టైల్​ మటన్​ బకెట్​ బిర్యానీ రెడీ.

దసరా విందులో స్పెషల్ డిష్​ గురూ! - నోరూరించే "గార్లిక్ చికెన్ ఫ్రై" - తిని తీరాలంతే!

దసరా స్పెషల్ స్వీట్స్ : నోరూరించే "రవ్వ జిలేజీ, మూంగ్​దాల్ లడ్డు, పాల బూరెలు"- ఈజీ​గా చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.