పంచాయతీ ఎన్నికల ప్రచారంలో విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు చేదు అనుభవం ఎదురైంది. నక్కపల్లి మండలం దేవవరం గ్రామ సర్పంచి అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే వెళ్లారు.
ఈ క్రమంలో సొంత పార్టీకి చెందిన.. మరో వర్గంవారు ఆయన్ను అడ్డగించి.. చుట్టుముట్టారు. సర్పంచి అభ్యర్థి ఎంపిక విషయంలో బాబూరావును నిలదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. అక్కడినుంచి ఎమ్మెల్యేను అతని వాహనంలో పంపించారు.
ఇదీ చదవండి:
విశాఖ, ఏఎంఆర్డీయే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు