ETV Bharat / state

లాక్‌డౌన్‌లో శ్రమదానం.. సొంతంగా రోడ్డు వేసుకున్న గ్రామస్థులు - విశాఖ జిల్లాలో సొంతంగా రోడ్డు నిర్మించుకున్న గ్రామస్థులు

ఎవరో వస్తారని... ఏదో చేస్తారని ఎదురుచూసి చూసీ మోసపోయింది చాలనుకున్న విశాఖ మన్యంలోని ఓ గ్రామస్థులు... కలసికట్టుగా కష్టాలను జయించేందుకు నడుం బిగించారు. పిల్లల బడి బాధలు తీర్చేందుకు... మాతాశిశు మరణాలు తగ్గించేందుకు ఆటంకంగా ఉన్న కొండరాళ్లను పిండి చేస్తున్నారు. అగ్గిపెట్టె కావాలన్నా ఆరు కిలోమీటర్లు కొండ ఎక్కిదిగాల్సిన పరిస్థితి నుంచి ఉపశమనం కల్పిస్తామంటూ హామీలు గుప్పించి మొహం చాటేసిన నేతలకు.. చేతలతో జవాబులు చెబుతున్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో సొంతంగా రోడ్డు వేసుకున్న గ్రామస్థులు

author img

By

Published : Jun 2, 2021, 6:48 AM IST

విశాఖ మన్యంలో కొండలూ కోనల మధ్య ఉన్న గ్రామాలు కోకొల్లలు. శాస్త్రసాంకేతిక అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ 10 శాతం గ్రామాలకే రోడ్ల సౌకర్యముంది. మిలిగిన ఎత్తైన కొండల్లో నివాసముంటున్న గిరిజనులు ఇప్పటికీ రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి లేకపోవటంతో నిత్యజీవితంలో ప్రతి అంశంలోనూ కష్టాలు పడుతున్నారు. పిల్లలు పాఠశాలలకు దూరమై, పండిన పంటలు తీసుకెళ్లి అమ్ముకోలేక, పురిటినొప్పులు పడుతున్న గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లలేక నిత్యావసర సరుకులు తెచ్చుకోలేక ఇలా కష్టాల జాబితా చెప్పుకుంటూపోతే అంతే ఉండదు.

రోడ్డు నిర్మించి తమ కష్టాలు తీర్చండని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులుగానీ, నేతలు గానీ పట్టించుకోలేదు. చూస్తూ కూర్చుంటే తమ బతుకులు మారవని భావించిన హుకుంపేట మండలం గుర్రాలతోట పైవీధి గ్రామస్థులు..చందాలు వేసి రోడ్డు నిర్మించుకుంటున్నారు. పాక్షిక లాక్‌డౌన్‌తో వలస వెళ్లినవాళ్లంతా సొంతూళ్లకు చేరుకున్నారు. అందరూ గ్రామంలో ఉండటంతోనే చిన్నాపెద్దా కలసి 3 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు నడుంబిగించారు. శ్రమదానం చేసి ఇప్పటికే కిలోమీటర్‌ మేర రోడ్డు పూర్తిచేశారు. పెద్దపెద్దరాళ్లను తొలగించేందుకు చందాలువేసుకుని జేసీబీ తెచ్చుకున్నారు.

రామసేతు నిర్మాణానికి ఉడుత సాయం చేసినట్లుగా పిల్లలు కూడా రోడ్డు పనిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రోజుకు 7 వేల చొప్పున జేసీబీ సాయంతో 15 రోజులపాటు పనిచేశారు. తమ దగ్గర ఉన్న డబ్బులు అయిపోవటంతో మిగిలిన రోడ్డు పూర్తిచేసేందుకు ఇంకెన్నాళ్లు పడుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే ఉపాధిహామీ పథకం కింద నిధులు ఇవ్వాలని..లేదా రోడ్డు పూర్తిచేసి తమను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. పూర్తిస్థాయిలో రోడ్డు ఉంటే తమ జీవనప్రమాణాలు మెరుగవుతాయని గిరిజనులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

Software Prashanth: ప్రేయసి కోసం పాక్​కి వెళ్లి.. నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.