ETV Bharat / state

విశాఖ శ్రీశ్రావణి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో తనిఖీలు - విశాఖలో శ్రీ శ్రావణి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

విశాఖలోని మహారాణి పేట వద్ద శ్రీశ్రావణి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు మరిచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసుపత్రిలో దాడులు చేశారు. తనిఖీలలో ఆ ఆరోపణలు నిజమని తేలాయి.

   విశాఖలో శ్రీ శ్రావణి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి

author img

By

Published : May 24, 2021, 10:42 PM IST

కొవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అదనపు ఎస్పీ స్వరూపరాణి హెచ్చరించారు. విశాఖలోని మహారాణి పేట వద్ద శ్రీ శ్రావణి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అదనపు ఎస్పీ జి.స్వరూపరాణి నేతృత్వంలో విజిలెన్స్ అధికారులు , ఔషధ నియంత్రణ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. హేమ సుందరి అనే మహిళ ఇటివలే కొవిడ్ బారిన పడటంతో ఆమె కుమారుడు అనిల్ కుమార్ బిల్లా… శ్రీ శ్రావణి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చాడు. చికిత్స అనంతరం ఇటీవలే ఇంటి వద్ద ఆమె మృతి చెందింది. నిబంధనలకు వ్యతిరేకంగా తన వద్ద నుంచి 12 రోజులకి 5 లక్షలకు పైగా బిల్లులు వసూలు చేశారంటూ ఆమె కుమారుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించగా… ప్రభుత్వం సూచించిన ధరల కన్న అధిక ధరల వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. జిల్లా కలెక్టర్​కు నివేదిక పంపించామని.. దాని అధారంగా చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి. ఆనందయ్య కరోనా మందు పనితీరుపై.. పరిశోధన ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.