విశాఖ జిల్లా జ్ఞానాపురంలోని కూరగాయలు, ఉల్లిపాయల మార్కెట్ లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు తెరవాల్సి ఉన్న మార్కెట్ ను 8 గంటలకు తెరుస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం గుర్తించింది. దీనివల్ల సమాయానికి రైతు బజారుకు ఉల్లిపాయలు చేరుకోవడం లేదని అధికారులు నిర్ధరించారు. వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి : 'ఉద్యోగ కల్పనలో ముఖ్యమంత్రి జగన్ ది అరుదైన రికార్డు'