విశాఖ గాజువాకలోని పలు పెట్రోల్ బంక లపై విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. డిఎస్పీ నరసింహమూర్తి నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. పెట్రోల్ కొలతలో అవకతవకలు, ఇతర అంశాలను పరిశీలించారు. దాడులు జరుగుతున్న సమయంలో అనుమతి లేకుండా భారీ ట్యాంకర్లోకి డీజిల్ కొట్టారు. ఈ కారణంతో విజిలెన్స్ పోలీసులు పెట్రోల్ బంక్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఆలయ ఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు