ETV Bharat / state

విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ వితరణ! - Victory Venkatesh Fans Distribution

విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతానికి చెందిన అప్పారావు సినీ హీరో వెంకటేష్​కి వీరాభిమాని. అతను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. సాటి అభిమాని సమస్యని అర్థం చేసుకున్న రాష్ట్ర వెంకటేష్ ఫ్యాన్స్ కరస్పాండెంట్ పి.చందు.. తనతో నిత్యం కాంటాక్ట్​లో ఉన్న అభిమానుల సాయంతో 62,000/- రూపాయలతోపాటు నెలరోజులకి సరిపడే నిత్యావసర వస్తువులు, దుస్తులు, మందులు అందజేశారు.

Victory Venkatesh Fans Distribution!
విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ వితరణ!
author img

By

Published : Jan 8, 2021, 5:12 PM IST

విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతానికి చెందిన అప్పారావు.. సినీ హీరో వెంకటేష్​కి​ వీరాభిమాని. అతను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన అతనికి ఆరోగ్య సమస్య తోడై చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. సాటి అభిమాని సమస్యని అర్థం చేసుకున్న రాష్ట్ర వెంకటేష్ ఫ్యాన్స్ కరస్పాండెంట్ పి.చందు.. తనతో నిత్యం కాంటాక్ట్​లో ఉన్న అభిమానుల సాయంతో 62,000/- రూపాయలతోపాటు నెలరోజులకి సరిపడే నిత్యావసర వస్తువులు, దుస్తులు, మందులు అందజేశారు.

అనకాపల్లి నూకాంబిక ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అప్పారావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఇంత గొప్ప సాయాన్ని అందించిన అభిమానులందరికీ జీవితాంతం తమ కుటుంబం రుణపడి ఉంటుందన్నారు.

2019లో కర్నూల్​లో చనిపోయిన ఇజ్రాయిల్ కుటుంబానికి 50,000 రూపాయాలు ఆల్ ఇండియా వెంకటేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అందజేసామని.. మళ్ళీ ఇప్పుడు అప్పారావు కుటుంబానికి 62,000 రూపాయలు అందజేసామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వెంకటేష్ అభిమానులు పెద్ద మొత్తంలో సేకరించి పంపి తమ సేవా నిరతిని చాటుకున్నారని... మిగతా ఏరియా అభిమానులు సైతం అద్భుతమైన స్పందనని అన్నారు. వారందరికీ ఈ సందర్భంగా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అభిమానసంఘాల సమన్వయ కర్త చందు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్జి శంకర్, పిల్లి శ్రీను, విజయనగరం వాసు, రమేష్, గాజువాక శివకుమార్, రాంబాబు, శరత్, లాయర్ శ్రీను, సతీష్,సోమేశ్, రాము, శ్రీను, దాడి రవికుమార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

యానాంలో ముగిసిన ప్రజాఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.