Gitam University: గీతం విశ్వ విద్యాలయంలో మాజీ ఉపకులపతి కోనేరు రామకృష్ణారావు పేరిట ఏర్పాటు చేసిన భవనాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో అయన మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వాలు సంపదను సృష్టించే ప్రయత్నం చేయాలని.. అది భావితరాల వారి అవసరం తీరుస్తుందని అన్నారు. సంపద సృష్టించకుండా అప్పులు చేసి పంచడం సరైన పనికాదని.. రాజకీయ పార్టీలు గుర్తించాలని హితవు పలికారు.
ఈ రోజుల్లో సంస్కరణల అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పదిమందికి ఉపయోగపడేలా జీవితాన్ని మలచుకోవాలని అన్నారు. ప్రజలకు చేయాలనుకున్న మేలు విషయంలో నాయకులు పట్టుదలతో ఉండాలని అన్నారు. రాజకీయాల్లో ఎత్తుకు ఎదిగినా మన మూలాలు మరిచిపోకూడదని అని చెప్పారు. ఆచార్య కోనేరు రామకృష్ణరావుతో తనకుండే అనుబంధాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు.
ఇవీ చదవండి: