ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ గోడను ఆనుకోని వెంకటాపురం గ్రామం ఉండటంతో...ఎక్కువ మందిపై ఈ వాయువు ప్రభావం పడింది. స్టైరీన్ ఘాడత ఎక్కువ ఉండటంతో..ఇప్పటికీ ఇండ్లలోనే దాని మూలాలు ఉన్నాయి. ఎన్నోప్రయాసలకోర్చి కష్టపడి పండించిన ధాన్యం అంతా పాడైపోయింది.
శిబిరాలకు వెళ్లి ఇంటికి వచ్చినా....ఇళ్లంతా అదే వాసన. కళ్లల్లో మంటలు వస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, గర్భిణీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మాకు ఈ వయసులో ఈ బాధలేంటని..వృద్ధులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎవరూ తమను పట్టించుకుంటారని వాపోయారు.
తమ గ్రామానికి అత్యధికంగా నష్టం జరిగినా ప్రభుత్వం మాత్రం పరిహారం న్యాయంగా ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులలో చేరిన వారి బిల్లులు తామే భరిస్తామని ప్రభుత్వ చెప్పిందని...ఇప్పటివరకూ అవి చెల్లించలేదని పేర్కొన్నారు. ఆ ఘటన తర్వాత ప్రజాప్రతినిధులు మర్చిపోయారని..మమ్మల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను పట్టించుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీచూడండి. 'అంతర్రాష్ట్ర వాహనాలను తనిఖీ చేయాల్సిందే'